Read more!

English | Telugu

ఈసారి పవన్ తప్పు లేదట... డాలీ న్యాయం చేస్తాడా..?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకొంటాడో ఎవరికీ తెలియదు. స‌డ‌న్‌ గా ఓ ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇస్తాడు. అంతే తొందరగా తీసేస్తాడు. సంప‌త్ నంది విష‌యంలో అదే జ‌రిగింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం రెండేళ్లు తిరిగిన సంప‌త్‌కి హ్యాండ్ ఇచ్చారు. ఆ స్థానంలో స‌డ‌న్‌ గా బాబి వ‌చ్చి చేరాడు. ఇప్పుడు క‌డ‌ప కింగ్ (ఇది వ‌ర్కింగ్ టైటిల్‌) విష‌యంలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. కొద్దిరోజుల్లో సినిమా షూటింగ్ అన‌గా... సూర్య‌ని త‌ప్పించి ఆ బాధ్య‌త‌ని డాలీకి అప్ప‌గించాడు. ఈ నిర్ణ‌యం ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల్ని కూడా షాక్‌కి గురిచేసింది. అయితే ఈసారి ప‌వ‌న్ త‌ప్పేం లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. సూర్య కావాల‌ని ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకొన్నాడ‌ని, ప‌వ‌న్ చివ‌రి వ‌ర‌కూ సూర్య‌నే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టాడ‌ని, అయితే సూర్య వినిపించుకోలేద‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ సినిమా కంటే న‌టుడిగా త‌న కెరీర్‌పైనే దృష్టి నిల‌ప‌డం చాలామందికి ఆశ్చ‌ర్యానికి గురి చేసినా.. సూర్య త‌న నిర్ణ‌యం ప‌ట్ల చాలా స్థిరంగా ఉన్నాడ‌ట‌. చివ‌రి క్ష‌ణాల వ‌రకూ ప‌వ‌న్ స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశాడ‌ని కానీ.. సూర్య విన‌లేద‌ని తెలుస్తోంది. మరి డాలీ ఈ ప్రాజెక్ట్ కు ఎంత వరకు న్యాయం చేస్తాడో... చూడాలి..!