English | Telugu

మగవాళ్ళు చేయలేనిది.. ఆడవాళ్ళు చేయగలిగేది.. పిల్లల్ని కనడమే!

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'పరదా'. ఆనంద మీడియా బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకుడు. ఆగస్టు 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది. (Paradha Trailer)

ట్రైలర్ లో ఊరి ఆచారం అంటూ ముఖానికి పరదా వేసుకొని అనుపమ దర్శనమిచ్చింది. అసలు ఆ పరదా వెనుకున్న కథ ఏంటనే ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. మెసేజ్ తో కూడిన ఓ ఎమోషనల్ రైడ్ ను చూడబోతున్నామనే హామీని ట్రైలర్ ఇస్తోంది. టెక్నికల్ గానూ బాగుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ మెప్పించాయి. "మగవాళ్ళు చేయలేనిది, ఆడవాళ్ళు చేయగలిగేది.. పిల్లల్ని కనడమే" వంటి డైలాగ్ లు కూడా ఆకట్టుకున్నాయి. మొత్తానికి 'పరదా' ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది.

ఈమధ్య ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో 'పరదా' మూవీ బాక్సాఫీస్ దగ్గర సర్ ప్రైజ్ చేస్తుందేమో చూడాలి.

గోపీసుందర్ సంగీతం అందిస్తున్న 'పరదా' చిత్రంలో దర్శన, సంగీత, రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా మృదుల్ సుజిత్ సేన్, ఎడిటర్ గా ధర్మేంద్ర వ్యవహరిస్తున్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.