Read more!

English | Telugu

ఇద్దరు తెలుగు హీరోయిన్లతో హారర్ థ్రిల్లర్ బాక్.. రిలీజ్ ఎప్పుడంటే!

తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలుగా చేసిన తమిళ మూవీ ' అరణ్మనై' . సుందర్. సి కీలక పాత్రలో నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో ' బాక్ ' పేరుతో రానుంది. 

అయితే రెండు వారాల క్రితం పంచుకో ప్రోమో సాంగ్ రిలీజ్ కాగా ఇందులో తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ ఈ మూవీని మరింత ట్రెండింగ్ లో ఉండేలా చేశాయి. ఈ సినిమాని ఖుష్బూ సుందర్, ఏపీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే కొన్ని అనివార్య కారాణాల వల్ల ఈ సినిమాని మే 3న  రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, డిల్లీ గణేశ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫీ కృష్ణమూర్తి చేయగా.. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ ను అందించారు. 

ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా హాట్ సాంగ్ ని రిలీజ్ చేయగా దానికి విశేష స్పందన లభిస్తోంది. మే మొదటి వారంలో రిలీజ్ అయ్యే ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని, కొత్త కథని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఈ మధ్యకాలంలో హారర్ సినిమాలు థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి.