Read more!

English | Telugu

వరుణ్ తేజ్ చెప్పి చెయ్యాల్సింది.. అదనంగా 275 రూపాయిలు

దేశభక్తి నేపథ్యంలో గతంలో చాలా మూవీస్  వచ్చాయి. రీసెంట్ గా అదే కోవలో వచ్చిన మూవీ ఆప‌రేష‌న్ వాలెంటైన్.   మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా  తొలిసారి నటించాడు. పైగా తెలుగులో రిలీజ్ అయిన ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ సినిమా కూడా ఇదే. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. 


ఆప‌రేష‌న్ వాలెంటైన్ ఈ శుక్రవారం నుంచి ఓటీటీ  వేదికగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది  ఒక రకంగా acharyakaramina విషయమే. ఎందుకంటే ఏ సినిమా అయినా కూడా ఓటిటి లోకి వచ్చే ముందు పబ్లిసిటీ చేస్తుంది. కానీ  ఆప‌రేష‌న్ వాలెంటైన్ మాత్రం సైలెంట్ గా వచ్చింది. నిజానికి మూవీ విడుదల సమయంలో  ఈ నెల 29  అని అధికారకంగా చెప్పారు. కానీ ఆ డేట్ కి  చాలా సినిమాలు రిలీజ్ ఉండటంతో ముందుగానే వచ్చింది. పైగా మూవీ చూడాలంటే స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో పాటు అద‌నంగా 279 రూపాయ‌లు చెల్లించాల్సివుంటుంది. తెలుగుతో పాటు హిందీ లాంగ్వేజ్ లో కూడా  అందుబాటులో ఉంది. మార్చి 1న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ  22 రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వ‌చ్చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

పుల్వామా ఎటాక్‌ తర్వాత మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ విధంగా పాకిస్థాన్ మీద ప్రతీకారం తీర్చుకుందనే  దాని మీద మూవీ తెరకెక్కింది. వరుణ్ తో పాటు మాజీ విశ్వ సుందరి మానుషీ చిల్లర్, నవదీప్ ,రుహాణి శర్మ లు ముఖ్య పాత్రలో నటించారు.  శక్తీ ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించగా సోనీ ఎంటర్ టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్నే అందుకుంది.