English | Telugu

యన్ టి ఆర్ ఊసరవెల్లి రామానాయుడు స్టుడియోలో

యన్ టి ఆర్ ఊసరవెల్లి రామానాయుడు స్టుడియోలో

యన్ టి ఆర్ "ఊసరవెల్లి" రామానాయుడు స్టుడియోలో శరవేగంగా జరుగుతూందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం"ఊసరవెల్లి". యన్ టి ఆర్ "ఊసరవెల్లి" సినిమాకి వక్కంతం వంశీ కథనందించారు. ఈ యన్ టి ఆర్ "ఊసరవెల్లి" సినిమా ఇప్పటివరకూ అరవై శాతం పూర్తయిందని వినికిడి.

ప్రస్తుతం యన్ టి ఆర్ "ఊసరవెల్లి" సినిమా నానక్ రామ్ గూడాలోని రామానాయుడు సినీ విలేజ్ లో జూన్ 13 నుండి జరుగుతూంది. యన్ టి ఆర్ "ఊసరవెల్లి" సినిమాకి యువసంగీత తరంగం దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. యన్ టి ఆర్ "ఊసరవెల్లి" సినిమాతో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో కె.యస్.రామారావు నిర్మిస్తున్న "చుర కత్తి" సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా ఆయన సరసన నటిస్తూంది.