English | Telugu
ముకుందలో సర్‌ప్రైజ్ గిఫ్ట్ లేదు
Updated : Dec 23, 2014
వెండి తెరపై వరుణ్ తేజ్ రూపంలో మరో మెగా హీరో రాబోతున్నాడు. ఈ నెల 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. మెగా హీరో సినిమా, అందులోనూ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్, దానికి తోడు ఠాగూర్ మధు తీస్తున్న సినిమా... వీటన్నింటి మధ్య రిలీజ్ అవుతున్న ముకుందపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఓ కేమియో రోల్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను వరుణ్ తేజ కొట్టిపారేశారు. ఈ సినిమాలో ఇతర ఏ మెగా హీరో అతిధి పాత్ర చేయలేదని స్పష్టం చేశారు. ముకుంద రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాస్త భిన్నంగా వుంటుందని తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.