English | Telugu

వెండితెర "అమ్మ"లు

అమ్మ అందమైన అనుబంధం..అంతేలేని అనురాగం..మరపురాని మధుర జ్ఞాపకం. ఎన్ని యుగాలు మారినా..ఎన్ని తరాలు దాటినా మారని మాధుర్యం అమ్మ. ఇలా అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భాషకు అందని భావం అమ్మలో ఉంది. ఆ భావాన్ని మన సినిమాల్లో ఆవిష్కరించారు మన దర్శక, నిర్మాతలు. తమ నటనతో అమ్మ పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసిన వారు ఎందరో ఉన్నారు. మదర్స్ డే సందర్భంగా వెండితెరపై అమ్మను మరిపించిన వారిపై స్పెషల్ స్టోరీ.

కన్నాంబ:

తెలుగు సినిమా తొలి రోజుల్లో అమ్మ పాత్రకు ప్రాణం పోసిన గొప్ప నటీమణి కన్నాంబ గారు. గంభీరమైన స్వరం, చక్కటి రూపం వీటికి తోడు మాటలు పలకడంలో ఆమె చాతుర్యం, హావభావాలు..వీటన్నింటి సాయంతో ఆమె మాతృమూర్తిగా ఒదిగిపోయారు.

పండరీభాయి:

అప్పట్లో తెలుగులో అందరి అగ్రకథానాయకులకి అమ్మగా నటించి మోస్ట్ వాంటెడ్ యాక్టర్‌గా మారారు పండరీభాయి. కృష్ణ నటించిన నేరము-శిక్ష సినిమాలో కొడుకుని నేరం నుంచి రక్షించుకునేందుకు తాపత్రాయపడే తల్లిగా పండరీభాయి నటన ఆకట్టుకుంది.

శాంతకుమారి:

తెలుగులో తల్లి పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ శాంతకుమారి. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహమహులకు అమ్మగా నటించారు శాంతకుమారి. శ్రీవెంకటేశ్వర మహాత్యం సినిమాలో శ్రీనివాసుని తల్లి వకుళమ్మగానూ..ప్రేమనగర్‌లో ఏఎన్నార్ తల్లిగా హృదయానికి హత్తుకునేలా నటించింది.

సూర్యకాంతం:

అదేంటి సూర్యకాంతం గారూ గయ్యాళీ అత్త పాత్రలకు పెట్టింది పేరు కదా? మరి అమ్మ పాత్ర సమయంలో ఆమెను చెప్పడం ఏంటనేగా మీకు డౌట్ రావొచ్చు. అత్తగారిగా కోడల్ని ఎంత హింసపెట్టినా..తల్లిగా తన పిల్లల్ని ప్రేమించే పాత్రలో సూర్యకాంతం గారు ఒదిగిపోయారు. అందుకే ఆమె గయ్యాళీ అత్తగారే కాదు ది బెస్ట్ మదర్ కూడా.

అంజలీదేవి:

తెలుగువారి సీతమ్మగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన అంజలీదేవి కెరిర్‌ ప్రారంభంలో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగారు. కానీ ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు రాకపోవడం, వయసు మీద పడటం తదితర కారణాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. అలా తల్లి పాత్రలకు న్యాయం చేశారు. భక్త ప్రహ్లాద , లక్ష్మీనివాసం, బడిపంతులు, తాతామనవడు, జీవన తరంగాలు ఇలా ఎన్నో సినిమాల్లో మదర్ క్యారెక్టర్ వేసి ఆ పాత్రకు న్యాయం చేశారు.

నిర్మలమ్మ:

తన నటజీవితంలో ఎక్కువగా అమ్మ పాత్రలే వేసి నిర్మల కాస్త నిర్మలమ్మ అయ్యారు. సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ ఇండస్ట్రీలోని అందరిచేత అమ్మ అని పిలవబడే ఏకైక అమ్మ-నిర్మలమ్మ.

అన్నపూర్ణ:

తెలుగులో అమ్మపాత్రలకు కేరాఫ్ అడ్రస్ అన్నపూర్ణ. తన సహజ నటనతో అమ్మగా జీవించారు అన్నపూర్ణ. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, అర్జున్, భానుచందర్, సుమన్ తదితర హీరోలందరికీ అమ్మ అంటే అన్నపూర్ణే.

మనోరమ:

తన నటనతో ప్రేక్షకుల చేత అచి అని ముద్గుగా పిలుచుకేనేంతటి పేరు సంపాదించుకున్నారు మనోరమ. ఆచి తమిళ్‌లో అమ్మ అని అర్థం. అలాంటి గొప్ప పదాన్ని మనోరమకు బిరుదుగా లభించిందంటే అమ్మపాత్ర ద్వారా ఆమె ప్రేక్షకుల్లో ఎంత ముద్ర వేశారో అర్థమవుతుంది.


సుజాత:

అమ్మ పాత్రలకు గౌరవాన్ని తీసుకువచ్చిన నటి సుజాత. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా ..తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. చంటి, కొండపల్లి రాజా సినిమాల్లో అమ్మగా జీవించి అవార్డులను సైతం గెలుచుకున్నారు.

సుధ:

సహజ సిద్ధమైన నటన, చూడగానే మన పక్కింటి ఆమెలానో, తెలిసిన వ్యక్తిలా కనిపించే రూపంతో ప్రజంట్ హీరో, హీరోయిన్లకు మదర్‌గా దూసుకుపోతున్నారు సుధ.

పవిత్రా లోకేశ్:

తెలుగు తెరపై ఇప్పుడు అమ్మ పాత్రలకు ప్రతిరూపం..పవిత్రా లోకేశ్. తల్లి పాత్రలో ఒదిగిపోయిన తీరు, ఆ సినిమాలు హిట్టైన తీరును గమనించి..ఆమెను తల్లి పాత్రకు ఎంచుకునే దర్శక నిర్మాతల సంఖ్య పెరిగిపోతోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.