English | Telugu

సోషల్ మీడియాని కమ్మేసిన వార్ 2 ..అంతా చేసింది ఆమెనే 

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)బర్త్ డే సందర్భంగా నిన్న 'వార్ 2 '(War 2)టీజర్ రిలీజైన విషయం తెలిసిందే. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మోస్ట్ అవైటెడ్ మల్టి స్టారర్ గా తెరకెక్కుతున్న 'వార్ 2 ' లో హృతిక్ రోషన్(Hrithik Roshan)ఎన్టీఆర్ కలిసి అభిమానులతో పాటు ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్ ని అందించనున్నారు. నిమిషం ముప్పై నాలుగు సెకన్ల నిడివితో ఉన్న టీజర్ ఈ విషయాన్నీ చెప్పకనే చెప్పింది. మూవీపై అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి.

ఇక ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ(Kiara Advani)చేస్తుంది. టీజర్ లో ఆమె బికినీ తో కనిపించడం, మేకర్స్ ఆమెని ఎస్టాబ్లిష్ చేసిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతుంది. దీంతో కియారా ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వెళ్ళింది. కియారా ఇప్పటి వరకు హిందీ, తెలుగు లాంగ్వేజెస్ కలుపుకొని సుమారు పదిహేను చిత్రాల వరకు చేసింది. ఆయా సినిమాల్లో క్యారక్టర్ కి తగ్గట్టుగా గ్లామరస్ గా కనిపించినా బికినీ లో ఇంతవరకు నటించలేదు. అలాంటిది ఫస్ట్ టైం వార్ 2 లో కనిపించడం సంచలనంగా మారింది. రేపు ఆగస్టు 14 న మూవీ రిలీజ్ అయ్యాక ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

వార్ 2 ని ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సుమారు 200 కోట్లతో నిర్మించగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. హిందీ, తెలుగు తో పాటు తమిళ భాషలో కూడా విడుదల కానుంది. టీజర్ రిలీజ్ అయ్యి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే తెలుగు వెర్షన్ 2 .9 మిలియన్ వ్యూస్, హిందీ వెర్షన్ 18 మిలియన్ల వ్యూస్ ని సాధించి సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్తుంది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.