English | Telugu
దేవర 2 అనౌన్స్ మెంట్ వీడియో.. ఇదెక్కడి ట్విస్ట్!
Updated : May 8, 2025
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో పాటు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత 'దేవర-2' మొదలుపెట్టనున్నాడు. నిజానికి దేవర పార్ట్-2 ఉంటుందా లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఇటీవల ఎన్టీఆర్ ఓ మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ.. పార్ట్-2 ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. (Devara 2)
'ఆర్ఆర్ఆర్' వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ 'దేవర'. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. 2024 సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టి, ఘన విజయం సాధించింది.
మొదటి భాగం హిట్ అయితే, రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎదురు చూడటం కామన్. అయితే, దేవర సినిమా.. కంటెంట్ పరంగా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందని, కేవలం ఎన్టీఆర్ స్టార్డంతోనే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించిందనే అభిప్రాయాలున్నాయి. అందుకే దేవర-2 ఉండకపోవచ్చని అభిమానులు కూడా భావించారు. కానీ, ఎన్టీఆర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దేవర-2 చేయడానికి సిద్ధమవుతున్నాడు. అసలు కథ పార్ట్-2 లోనే ఉంటుందని, స్క్రిప్ట్ కూడా అద్భుతంగా వచ్చిందని.. అందుకే ఎన్టీఆర్ దేవర-2 చేయడానికి రెడీ అవుతున్నట్లు వినికిడి.
దేవర-2 పనులు చకచకా జరుగుతున్నాయట. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిందని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జూలై నుంచి మొదలవుతాయట. డ్రాగన్ షూటింగ్ పూర్తి కాగానే.. దేవర-2 సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది. అంతేకాదు, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న అనౌన్స్ మెంట్ వీడియోతో సర్ ప్రైజ్ చేయబోతున్నారట మూవీ టీం.
ఎన్టీఆర్ బర్త్ డేకి 'వార్-2' ఫస్ట్ లుక్, 'డ్రాగన్' గ్లింప్స్ వస్తాయని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు దేవర-2 అనౌన్స్ మెంట్ వీడియో అనేది బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. మరి ఈ అనౌన్స్ మెంట్ వీడియోతో ఒక్కసారిగా 'దేవర-2'పై అంచనాలు పెరిగిపోతాయేమో చూడాలి.
