English | Telugu

రానా నేను - నా రాక్షసికి సెన్సార్ ఎ సర్టిఫికేట్

రానా "నేను - నా రాక్షసి"కి సెన్సార్ "ఎ" సర్టిఫికేట్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై, రానా హీరోగా, నలక నడుము ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం" నేను - నా రాక్షసి". ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు సంగీతాన్నందించటం విశేషం. రానా "నేను - నా రాక్షసి" మూవీ ఏప్రెల్ 25 వ తేదీన సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుంది.

రానా "నేను - నా రాక్షసి" చిత్రానికి సెన్సారు వారు "ఎ" సర్టిఫికేట్ ఇవ్వటం విశేషం. రానా "నేను - నా రాక్షసి" చిత్రంలో హింస ఎక్కువగా ఉన్నందున, అలాగే హీరో రానాకీ, హీరోయిన్ ఇలియానాకీ మధ్య లిప్ లాక్ సీన్ ఉండటం వలన సెన్సారు వారు "ఎ" సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ చిత్రంలో హీరో రానా ఒక ప్రొఫెషనల్ గా నటిస్తూండగా, అతని గడుసు ప్రియురాలిగా ఇలియానా నటిస్తుంది. రానా "నేను - నా రాక్షసి" మూవీలో ఆలీతో పాటు ముమైత్ ఖాన్‍ కూడా విభిన్నమైన పాత్రలో కనిపించనుందట.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.