English | Telugu
బాబోయ్ ఆమె మళ్ళీ పడిందంట..!!
Updated : May 16, 2015
నయనతార ప్రొఫెషన్ పరంగా ఎంత టాప్ లో వుంటుందో, అలాగే ఎఫైర్లు, ప్రేమ వ్యవహారాల విషయంలోనూ ఆమె ముందుంటోంది. ఇప్పటికే శింబు, ప్రభుదేవాలతో నయనతార ప్రేమ వ్యవహారం ఓ సంచలనం. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్ గా ఈవిడ మళ్ళీ కొత్తగా ప్రేమలో పడిందట. ఈసారి హీరోలతో పెట్టుకోకుండా దర్శకుడ్ని ఎంచుకుందట. ‘పొడాపొడి’ చిత్రానికి దర్శకత్వం వహించిన విఘ్నేష్ శివ అనే వ్యక్తి లవ్‌లో పీకలదాకా కూరుకుపోయిందట. ఆయన ప్రేమకు కానుకగా ఖరీదైన కారుని కూడా కొనిచ్చేసి, ప్రస్తుతం ఆయనతో మాల్దీవులు వెళ్ళిపోయి, ప్రేమ దీక్షలో కాలం గడుపుతుందట. మరీ ఈ సారైన నయనతార ప్రేమ లో సక్సెస్ కావాలని కోరుకుందాం.