English | Telugu

నాగ్ ఏం ప్లాన్ వేశాడండీ..

చిన్న సినిమా తీసి, దానికి భారీ ప్ర‌మోషన్లు జోడించి సినిమాకి క్రేజ్ తెచ్చుకొని, రెట్టింపు లాభాలు తెచ్చిపెట్ట‌డం ఇప్ప‌టి లేటెస్ట్ టెక్నిక్‌. ఉయ్యాల జంపాల సినిమాకి నాగార్జున అదే చేశాడు. అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ పై అతి త‌క్కువ బ‌డ్జెట్‌లో నిర్మించిన ఈ సినిమా మంచి లాభాల్ని సంపాదించుకొంది. ఇప్పుడు మ‌రోసారి నాగ్ అలాంటి స్కెచ్చే వేస్తున్నాడు. కొత్త వాళ్ల‌తో `నిర్మలా కాన్వెంట్‌` అనే ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు నాగ్.

టైటిల్ భ‌లే క్యాచీగా ఉంది క‌దూ. పైగా నాగ్ నిర్మాత అంటే ఈ సినిమాకి విప‌రీత‌మైక క్రేజ్ వ‌చ్చేస్తుంది. ఇంకో విశేషం.. ఈ సినిమాతో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోషన్ క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇవ్వ‌డం. శ్రీ‌కాంత్ త‌న‌యుడి తొలి సినిమా అంటే అదో స్పెష‌ల్ క్రేజ్‌. దీనికి ఇంకాస్త స్పెషాలిటీ యాడ్ చేస్తున్నాడు నాగ్. ఈసినిమాలో తానూ ఓ కీల‌క పాత్ర క‌నిపిస్తాడ‌ట‌. అంటే... ఇది నాగ్ సినిమానే చాలామ‌ణీ అవ్వ‌బోతోంద‌న్న‌మాట‌.

కోటి రూపాయ‌ల వ్య‌యంతో సినిమా పూర్తి చేసి, భారీ ప్ర‌మోష‌న్లు క‌ల్పించి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు నాగ్‌. అలాగైతే క‌నీసం రూ.10 నుంచి రూ.15 కోట్ల వ‌ర‌కూ ఈ సినిమా బిజినెస్ జ‌రుపుకొంటుంది. అంటే కోటి రూపాయ‌ల‌కు ప‌దిహేను కోట్ల వ్యాపారం అన్న‌మాట‌. దీనికి మించిన స్కెచ్ ఇంకేముంటుంది???

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.