English | Telugu

ప‌వ‌న్ అత్త‌తో.. వెంకీ ఏం చేస్తాడు?

అత్తారింటికి దారేదితో మ‌ళ్లీ తెర‌పైకొచ్చింది న‌దియా. ఆ త‌ర‌హా పాత్ర‌ల్లో సూటైపోతాన‌ని నిరూపించుకొంది. దృశ్యం సినిమాలోనూ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకొంది. పెద్ద‌రికం, హుందాత‌నం క‌ల‌బోసిన పాత్ర‌ల‌కు ఆమె సూటైపోతుంద‌ని ద‌ర్శ‌కులూ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు అలాంటి మ‌రో అవకాశం ద‌క్కింది. వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా వారాహి చ‌ల‌న చిత్రం సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించాల‌ని భావిస్తోంది. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ సినిమాలో వెంక‌టేష్ స‌ర‌స‌న న‌దియా న‌టించ‌నుంద‌ని స‌మాచార‌మ్‌. 40లో ప‌డిన భార్యాభ‌ర్త‌ల క‌థ ఇది. వారి మ‌ధ్య జ‌రిగే సంఘ‌ట‌న‌లు, వారి మ‌ధ్య బంధాలూ.. ఈ క‌థ‌కు బ‌లం. ఈ సినిమాలో మ‌రో యువ జంట కూడా ఉంద‌ట‌. అందుకోసం నూత‌న న‌టీన‌టుల‌ను ఎంచుకోవాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. దృశ్యంలానే.. ఇది కూడా ఓ కొత్త క‌థ అట‌. హీరో అంటే యాభై దాటినా ప‌ద‌హారేళ్ల అమ్మాయిల‌తో డ్యూయెట్లు పాడాల‌ని చూస్తున్న ఈ త‌రుణంలో వెంకీ ఆ మూస నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. కొత్త దారిలో న‌డ‌వ‌డం ఆద‌ర్శ‌ప్రాయ‌మే. మ‌రి ప‌వ‌న్ అత్త‌తో వెంకీ చేసే రొమాన్స్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.