Read more!

English | Telugu

నా మాజీ బాయ్ ఫ్రెండ్ ని తలుచుకొని కొట్టమన్నాడు

సినిమా  హీరోయిన్ అవ్వాలంటే  అదృష్టం ఉండాలి. అందులోను సినిమా ఉన్నాలేకపోయినా ప్రేక్షకులు  తన గురించే ఆలోచిస్తు ఉండాలంటే పెట్టి పుట్టాలి. అతి తక్కువ మంది హీరోయిన్లకే అంతటి సినీ వరం లభిస్తుంది. ఆ జాబితాలో చేరిన అందాల భామ  మృణాల్ ఠాకూర్(mrunal thakur)  టూ డే టాక్ అఫ్ ది డే గా నిలిచింది.

మృణాల్ రీసెంట్ గా ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.నేను షాహిద్ కపూర్ కి పెద్ద అభిమానిని. తనతో కలిసి జెర్సీ మూవీలో చేశాను. ఒక సన్నివేశంలో షాహిద్ కపూర్ ని చెంప కేసి కొట్టాలి. నిదానంగా కొడతాను ఎడిట్ లో కవర్ చెయ్యండి అని చెప్పాను. కానీ దర్శకుడు మాత్రం  ఒప్పుకోలేదు. షాహిద్ కూడా నిజంగానే కొట్టమన్నాడు. పైగా నీ మాజీ బాయ్ ఫ్రెండ్ ని తలుచుకొని కొట్టమని చెప్పాడు. రెండు కెమెరాలతో 
చిత్రీకరించిన ఆ సన్నివేశానికి మూడుగంట సమయం పట్టిందని  ఆనాటి విషయాలని  గుర్తు చేసుకుంది.  జెర్సీ మూవీ తెలుగులో నాని హీరోగా వచ్చింది

ఇక మృణాల్ కి షాహిద్ అంటే చాలా ఇష్టం.ఆమె అభిమాన నటుడు కూడా. అలాగే  షాహిద్ నవ్వు కూడా చాలా ఇష్టం. ఈ విషయాలన్నీ కూడా ఆమెనే చెప్పింది.అలాగే కథ నచ్చితే తల్లి, అక్క పాత్రలైనా చేస్తాను. ఆ విషయంలో నాకు ఎలాంటి భయం లేదని చెప్పింది. ఆమె  గత ఏడాది నాని తో చేసిన హాయ్ నాన్న మంచి విజయాన్ని సాధించింది. రీసెంట్ గా చేసిన ఫ్యామిలీ స్టార్ మాత్రం పరాజయం  పాలయ్యింది. ప్రస్తుతానికి బాలీవుడ్ లో ఒక మూవీ చేస్తుంది