Read more!

English | Telugu

దీపావళికి "విశ్వరూపం 2"


అత్యంత భారీ బడ్జెట్ లో కమల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన "విశ్వరూపం" సినిమా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చిన పబ్లిసిటీ పుణ్యమా అని సూపర్ హిట్ అవ్వడంతోపాటు నిర్మాతలకు చెప్పుకోదగ్గ లాభాలు తెచ్చిపెట్టింది. ఆ స్పూర్తితో తెరకెక్కించిన "విశ్వరూపం 2" మాత్రం గత ఏడాది కాలంగా విడుదలకు సిద్ధమవుతూనే ఉంది. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రం గతేడాది విడుదలకావాల్సి ఉంది, కానీ రవిచంద్రన్ ఫైనాన్షియల్ గా ప్రోబ్లమ్స్ ఫేస్ చేస్తుండడంతో సినిమాను పక్కనపెట్టారు. ఆ తరువాత కమల్ హాసన్ కూడా వేరే సినిమాలతో బిజీ అయిపోవడంతో "విశ్వరూపం 2"ను దాదాపుగా పక్కనపెట్టేశారు.

అయితే.. ఇప్పుడీ చిత్రాన్ని మళ్ళీ ట్రాక్ ఎక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ రవిచంద్రన్ ఫైనాన్షియల్ గా కాస్త కుదుటపడడంతో.. "విశ్వరూపం 2"కి మిగిలిపోయిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేయిస్తున్నాడట. ఈ ఏడాది దీపావళికి "విశ్వరూపం 2" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేసుకొంటున్నాడు!