English | Telugu
కూతురితో కమల్ సినిమా మొదలవుతోంది..!
Updated : Apr 12, 2016
భారతదేశం గర్వించదగ్గ నటుల్లో, కమల్ హాసన్ పేరు తప్పకుండా ఉంటుంది. సినీఇండస్ట్రీల్లో తన మార్క్ ను అంత స్పష్టంగా వేశారాయన. కమల్ తనయగా ఇండస్ట్రీలో ఎంటరై, తనకంటూ ఒక ఇమేజ్ ను ఎస్టాబ్లిష్ చేసుకుంది శృతిహాసన్. తాజాగా ఈ తండ్రీకూతుళ్లిద్దరూ కలిసి నటించడానికి సిద్ధపడుతున్నారు. టికే రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తన కూతురితో కమల్ నటించబోతున్నారు. ఈ నెల 29 న చెన్నైలో సినిమా ముహూర్తపు షాట్ ను చిత్రీకరించనున్నారు. తండ్రీ కూతుళ్ల మధ్యన ఉండే అనుబంధం గురించి చూపిస్తూ ఈ సినిమా సాగుతుందని సమాచారం. కమల్, శృతి ఇద్దరూ ఎన్నారైలుగా నటించబోతున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని అందించబోతున్నారు. వీళ్లిద్దరూ కలిసి కనబడటం ఇదే మొదటి సారి కావడం విశేషం. త్వరలోనే మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నారు.