Read more!

English | Telugu

కమల్ హాసన్, అమల సినిమా రీమేక్..మంచి జోరు మీద ఉన్న కుర్ర  హీరో  

భారతీయ చిత్ర పరిశ్రమలో  రీమేక్ లు  అనేవి కొత్త కాదు. అలా తెరకెక్కిన సినిమాలు  చాలా వరకు విజయాన్ని సాధించాయి. కొన్ని సార్లు పరాజయం  కూడా పాలయ్యాయి.కానీ రీమేక్ లు మాత్రం తెరకెక్కుతూనే ఉన్నాయి. కాకపోతే ఒక భాషలో వచ్చిన సినిమాలు వేరే భాషల్లోకి రీమేక్ అవుతుంటాయి. కానీ ఒక  భాషలో వచ్చిన సినిమా మళ్ళీ అదే భాషలో తెరకెక్కడం అనేది రేర్ గా జరుగుతుంటుంది. ఇప్పుడు ఇది రిపీట్ అవుతుంది.

కమల్ హాసన్ ,అమల హీరో, హీరోయిన్లు గా 1988 లో వచ్చిన మూవీ సత్య. ఇప్పుడు ఈ మూవీ సుమారు 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెరపై రానుంది.  ప్రముఖ తమిళ కధానాయకుడు అశోక్ సెల్వన్ కమల్ పాత్రలో మెరవబోతున్నాడు. ఇటీవలే ఫోటో  షూట్ కూడా జరిగింది. వాటి తాలూకు ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక అమల క్యారక్టర్ లో ఏ హీరోయిన్ చెయ్యబోతుందో మరికొన్ని రోజుల్లో తెలియనుంది.తాజాగా  అశోక్ సెల్వన్ ఫోర్ తొళిల్, బ్లూ స్టార్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి జోరు మీద ఉన్నాడు. విగ్నేష్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తుంది.

ఇక ఓల్డ్  సత్య కి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. రాజ్ కమల్  ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ నే స్వయంగా  నిర్మించాడు .అప్పట్లో  కలెక్షన్ల పరంగా కూడా  రికార్డు సృష్టించింది. అర్జున్ అనే హిందీ చిత్రానికి రీమేక్ గా సత్య తెరకెక్కడం గమనార్హం.