Read more!

English | Telugu

ఆరుగురు హీరోయిన్లతో హీరామండి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు హీరోయిన్లతో సరికొత్త వెబ్ సిరీస్ త్వరలో రానుంది.అదేంటో ఓసారి చూద్దాం. భాజీరావు మస్తానీ, గంగూభాయ్, పద్మావతి , రామ్ లీలా లాంటి ఎపిక్ సినిమాలని డైరెక్ట్ చేసిన సంజయ్ లీలా భన్సాలీ ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

హీరామండి అనే వెబ్ సిరీస్ తో బాలివుడ్ ని షేక్ చేయబోతున్నాడు భన్సాలీ. ఈ సిరీస్ కి డైమండ్ బజార్ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్.. మన గతంలో జరిగిన కొన్ని వాస్తవాలని ప్రేక్షకులకి తెలియజేయానికే ఇది రూపొదిస్తున్నాడంట. ఈ సిరీస్ లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీద్ షేక్, షర్మిన్ సెగల్, అదితి రావు హైదరి లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ తెరకెక్కిస్తున్న ఈ సీరీస్ ని మే 1న స్ట్రీమింగ్ కి తీసుకున్నట్టుగా మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు కొన్నిచోట్ల వేశ్యల జీవనశైలిని తెలియజేస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. అయితే అందులో అత్యంత ప్రభావం చూపిన ' హీరామండి- ది డైమండ్ బజార్ ' అనే ప్రాంతంలోని వేశ్యల కథని ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు.

ఈ సిరీస్ లో వేశ్యల జీవనశైలీ, వారు అలా కావడానికి వారికి ఎదురైన సవాళ్ళేంటి? సాంస్కృతిక వాస్తవాలేంటని ఇందులో చూపించనున్నారు. ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలని ప్రధాన అంశాలుగా సంజయ్ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. అయితే  ఇప్పటివరకు ఓ వెబ్ సిరీస్ లో ఇంతమంది హీరోయిన్లు ఉండటం ఇదే ప్రథమం. అయితే సంజయ్ లీలా భన్సాలీ మేకింగ్ అంటే హిస్టారికల్ చిత్రాలని ఎక్కువగా తీస్తారని అవి కూడా భారీ బడ్జెట్ సినిమాలే అని అందరికి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీలోకి రానుంది‌.