Read more!

English | Telugu

‘కల్కి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. జూన్‌ 27ని బ్లాక్‌ చేసుకున్న ప్రభాస్‌!

ఇప్పుడు అందరి దృష్టీ ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ల ‘కల్కి’ మీదే ఉందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇటీవల ఈ సినిమాలోని అశ్వథ్ధామ క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్‌. అమితాబ్‌ బచ్చన్‌ ఈ క్యారెక్టర్‌లో ఎంతో డిగ్నిఫైడ్‌గా కనిపించారు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉన్న ఈ సినిమా తప్పకుండా ఓ రేంజ్‌లో ఉంటుందని అందరూ భావిస్తున్నారు. 

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి రిలీజ్‌ పెద్ద సమస్య అయిపోయింది. ముందుగా అనుకున్న మే 9కి రిలీజ్‌ చెయ్యడానికి కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. అప్పటికి ఎన్నికల ప్రచారాలు పీక్స్‌లో ఉంటాయి. అలాంటి సమయంలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఎంతవరకు థియేటర్లకు వస్తారనేది ఓ డౌట్‌ కావచ్చు. అందుకే ‘కల్కి’ని జూన్‌ 27న రిలీజ్‌ చెయ్యాలని ఫిక్స్‌ అయ్యారు. నిన్న మొన్నటి వరకు వార్తగా ఉన్న ఈ రిలీజ్‌ డేట్‌ను శనివారం ఫిక్స్‌ చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. 

జూన్‌ 13న రామ్‌చరణ్‌, శంకర్‌ల ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ చెయ్యాలని భావిస్తున్నారు. అంటే ఈ సినిమా రిలీజ్‌ అయిన రెండు వారాలకే ‘కల్కి’ రాబోతోంది. అలాగే మోస్ట్‌ ఎవైటింగ్‌ మూవీగా పేరు తెచ్చుకున్న ‘పుష్ప2’ ఆగస్ట్‌ 15న విడుదలవుతోంది. ఈ రెండు సినిమా మధ్యలో ‘కల్కి’ రిలీజ్‌ కానుంది. ‘కల్కి’ రిలీజ్‌కి, ‘పుష్ప2’ రిలీజ్‌కి మధ్య చాలా గ్యాప్‌ ఉంది. కానీ, ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘కల్కి’ మధ్య ఎక్కువ గ్యాప్‌ లేదు. దీనివల్ల గేమ్‌చేంజర్‌ చిత్రం కలెక్షన్లపై ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.