English | Telugu

ఎన్టీఆర్ కోసం 'క్యూ' పెరిగింది

ఎన్టీఆర్‌కి గ‌త కొంత‌కాలంగా స‌రైన విజ‌యాల్లేవు. టెంప‌ర్‌తో కాస్త ఫామ్‌లోకి వ‌చ్చాడంతే. దాన్నీ హిట్ట‌ని చెప్ప‌లేం. అయితేనేం... ఎన్టీఆర్ కోసం ద‌ర్శ‌కుల క్యూ మొద‌లైంది. ఎన్టీఆర్ ఎప్పుడు దొరుకుతాడా, త‌న‌తో సినిమా చేసేద్దామా... అని ఆత్రుత‌తో ఎదురుచూస్తున్న‌వాళ్ల లిస్టు పెరుగుతూనే ఉంది. ప్ర‌స్తుతం సుకుమార్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ త‌రువాత చాన్స్ నాదే.. అని చాలామంది ద‌ర్శ‌కులు క‌ల‌లుకంటున్నారు. అలా క‌ల‌లు క‌నేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. హరీష్‌శంక‌ర్ ఎన్టీఆర్ కోసం ఓ క‌థ రాసుకొన్నాడు.

ఇటీవ‌ల లైన్ కూడా వినిపించాడు. దాంతో ఎన్టీఆర్ కూడా ఆయ‌న్ని `వెయిటింగ్‌` లిస్టులో పెట్టాడు. త్రివిక్ర‌మ్ - ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా ఎప్పుడో రావాల్సింది. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఈకాంబినేష‌న్ ఎప్పుడైనా సెట్ట‌య్యే అవ‌కాశాలున్నాయి. ప‌టాస్‌తో హిట్టుకొట్టిన అనిల్ రావిపూడి కూడా ఎన్టీఆర్ కోసం ఓ స్టోరీ రెడీ చేసుకొన్నాడు. సురేంద‌ర్ రెడ్డికీ... ఊస‌ర‌వెల్లి త‌ర‌వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేసి, హ్యాట్రిక్ కొట్టాల‌ని బ‌లంగా ఉంది.

ఇప్పుడు మిర్చి, శ్రీ‌మంతుడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కూడా ఈ ద‌ర్శ‌కుల సంఘంలో చేరిపోయిన‌ట్టు స‌మాచారం. శ్రీ‌మంతుడు నిర్మాత‌లు మైత్రీ మూవీస్ సంస్థ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయ‌బోతోంది. ద‌ర్శ‌కుడిగా కొర‌టాల శివ‌ని ఎంచుకొన్న‌ట్టు స‌మాచారం. ఆల్రెడీ క‌థ కూడా సిద్ధంగా ఉంద‌ట‌. ఎన్టీఆర్ కి మైత్రీ మూవీస్ అడ్వాన్సు కూడా ఇచ్చేసింది. క‌థ విని, గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే, ఈ సినిమాప‌ట్టాలెక్కుతుంది. సో.. ఎన్టీఆర్ కోసం అర‌డ‌జ‌ను ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నార‌న్న‌మాట‌. మ‌రి వారిలో అవ‌కాశం ఎవ‌రికి ఇస్తాడో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.