English | Telugu

'మదరాసి'లో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్!

శివ కార్తీకేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'మదరాసి' (Madharaasi). శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్. సెప్టెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అలాంటిది ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది?. ఒక్కసారిగా తెలుగునాట భారీ హైప్ వస్తుంది కదా. అయితే ఇందులో ఎన్టీఆర్ నటించలేదు కానీ.. నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని శివకార్తికేయన్ వ్యక్తం చేశాడు. (Jr NTR)

శివకార్తికేయన్ తెలుగు మార్కెట్ పై కూడా బాగానే దృష్టి పెడుతున్నాడు. ఆయన గత చిత్రం 'అమరన్' తెలుగునాట మంచి వసూళ్లు సాధించింది. ఆ ఉత్సాహంతోనే 'మదరాసి'కి తెలుగులో బాగానే ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ రుక్మిణి వసంత్ తో కలిసి యాంకర్ సుమకి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో సుమ ఒక ఆసక్తికర ప్రశ్న అడిగింది. 'మదరాసి'లో గెస్ట్ రోల్ ఉన్నట్లయితే.. తెలుగు హీరోలలో ఎవరిని పెట్టుకుంటారు అని సుమ అడగగా.. 'జూనియర్ ఎన్టీఆర్' అని సమాధానమిచ్చాడు శివకార్తికేయన్.

కాగా, ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఇందులో కూడా రుక్మిణి వసంత్ నే హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మూవీలో తన పార్ట్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు రుక్మిణి తెలిపింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.