English | Telugu

రోజా చాలా హెల్ప్ చేసిందంటున్న జానీ మాస్టర్

తోటి డాన్సర్ పై లైంగిక ఆరోపణల కేసులో కొన్ని రోజులు జైలులో ఉన్న జానీ మాస్టర్(jani master)ఇటీవల బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా తెరకెక్కుతున్న కేసిఆర్(kcr)అలియాస్ కేశవ చంద్ర రమావత్ అనే సినిమా ఫంక్షన్ కి హాజరయ్యాడు. రోజా, హైపర్ ఆది, శివ బాలాజీ వంటి నటులు కూడా హాజరయ్యారు.

జానీ మాస్టర్ మాట్లాడుతూ కష్ట కాలంలో నన్ను నమ్మి నా వెంట ఉన్న వారందరికీ ధన్యవాదాలు. రోజా(roja)గారి గురించి రాకేష్(raking rakesh)ఎప్పుడు నాతో ఎప్పుడు చెప్తుంటాడు. రాకేష్ కి ఆవిడ చాలా అండగా ఉన్నారు.రాకేష్ కే కాదు చాలా మందికి రోజా గారు హెల్ప్ చేసారు. ఆ విషయం నాకు తెలుసు.నా వైఫ్ నాకు వెన్నెముక. భర్తలు ఉన్న ప్రతి భార్య తల్లిగా స్నేహితురాలిగా భర్త వెనుక ఉండబట్టే భర్తలు ఒక స్థాయిలో ఉన్నారు.పది మంది బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకునే వ్యక్తి రాకింగ్ రాకేష్. ఖచ్చితంగా సినిమా విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చాడు. చాలా రోజుల తర్వాత జానీ మాస్టర్ చేసిన ఈ ఫస్ట్ స్పీచ్ ప్రాధాన్యత ని సంతరించుకుంది.


రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.