English | Telugu
నువ్వు మారవా అంజలి
Updated : May 15, 2015
అచ్చం మన పక్కింటి అమ్మాయిలా ఉండే అంజలి తన నటనతో అందరిని ఆకట్టుకొని మంచి హీరోయిన్ ఎదిగింది. ఆ మధ్య ఫ్యామిలీ వివాదాల వల్ల కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆమె ఒక్కటే ఆమె వల్ల దర్శకనిర్మాతలు కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దానివల్ల కొన్ని రోజుల పాటు అంజలిని సినిమాల్లోకి తీసుకోవడానికే భయపడిపోయారు దర్శకనిర్మాతలు. అయితే గీతాంజలి సహా ఒకటి రెండు హిట్ లు వచ్చిన తరువాత మళ్లీ అంజలి ఫామ్ లోకి వచ్చింది. దీంతో అంజలి కూడా మువీ మేకర్లను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఆఫర్లు దక్కించుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ బొద్దుగుమ్మకు మళ్లీ ఎమైందో ఏమో..ఆమె నటిస్తున్న సినిమాలో ఓ సాంగ్ ను పెండింగ్ పెట్టి అమెరికా చెక్కేసిందట. మొదట.. ఏప్రిల్ మొదటి వారంలో చేద్దామన్న అంజలి తరువాత ఏప్రిల్ 20 న చేద్దామని దర్శకనిర్మాతలకు చెప్పిందట. ఏప్రిల్ 20 కూడా గడిచిపోయినా అంజలి రాకపోవడంతో దర్మకనిర్మాతల్లో టెన్షన్ మొదలైందట. అసలు అంజలికి ఏమైంది? ఎందుకిలా చేస్తుంది? ఏదైనా సమస్యల్లో చిక్కుకుందా? లేక రిలాక్స్ అవ్వడానికి విదేశాలకు వెళ్లిందా? ఇలా ఎన్నో ప్రశ్నలు వాళ్ల బుర్రల్లో తిరుగుతున్నాయి. కానీ వీటన్నింటికి సమాధానం చెప్పాలంటే అంజలి రావాలి. వివరణ ఇవ్వాలి.