English | Telugu
యానిమల్ విలన్ పుణ్యమా అని పవన్ కళ్యాణ్ అభిమానుల ఖుషి
Updated : Nov 28, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ హరి హర వీరమల్లు. పవన్ గత చిత్రాలైన భీమ్లా నాయక్ ,బ్రో ల కంటే ముందే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ ఆ రెండు చిత్రాలు విడుదల అయ్యాయి గాని హరి హర మాత్రం లేటు అవుతు వస్తుంది. ఎప్పటినుంచో ఈ మూవీ నుంచి తాజా అప్ డేట్ రావటంలేదనే బాధలో ఉన్న పవన్ అభిమానులకి తాజాగా ఒక హీరో చెప్పిన ఒక డైలాగ్ తో మంచి జోష్ వచ్చింది.
బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ బాబిడియోల్ పవన్ కళ్యాణ్ నయా మూవీ హరిహర వీరమల్లులో కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. అలాగే యానిమల్ లో కూడా విలన్ గా నటిస్తున్నాడు. నిన్న జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఫంక్క్షన్ కి హాజరయ్యిన బాబీడియోల్ హరి హర వీర మల్లు సినిమాలోని తన క్యారక్టర్ కి సంబంధించిన ఒక డైలాగ్ ని చెప్పాడు. బాద్షా బేగం మీరు మా ప్రాణం..మా ప్రాణాలు కాపాడారు..మీకేం కావాలో కోరుకోండి..ఆ కోరిక నెరవేరడానికి ఆదేశాలు జారీ చేస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు బాబీ డియోల్ చెప్పిన ఈ డైలాగ్ పవన్ ఫాన్స్ లో జోష్ తెచ్చింది. అలాగే ఆ డైలాగ్ మరోసారి అందరు హరి హర వీర మల్లు గురించి మాట్లాడుకునేలా చేసింది.
హరి హర వీర మల్లు రెండు సంవత్సరాల క్రితమే షూటింగ్ ని ప్రారంభించుకుంది. మొదట కొన్ని షెడ్యూలని పూర్తి చేసుకున్న ఈ సినిమా కొన్ని అనుకోని కారణవల్ల వాయిదా పడుతు వస్తుంది. 17 వ శతాబ్దం నాడు మొఘల్ లు హైదరాబాద్ ని పరిపాలించినప్పుడు జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా హరి హర వీర మల్లు తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జట్ తో రూపుదిద్దుకుంటున్న హరి హర వీరమల్లు షూటింగ్ ని త్వరగా పూర్తి చేసుకోవాలని పవన్ ఫాన్స్ కోరుకుంటున్నారు.
