English | Telugu
కథానాయికల్ని కంగారు పెడుతున్న బాత్రూమ్ వీడియోలు!
Updated : Feb 17, 2015
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోందని మురిసిపోవాలో, లేదంటే ఆ పరిజ్ఞానాన్ని వాడుకొంటూ వెర్రితలలు వేస్తున్న వినోదాన్ని సృష్టిస్తున్నందుకు సిగ్గుపడాలో అర్థం కాని పరిస్థితి. సీక్రెట్ కెమెరాలు వచ్చాక ఎందరి జీవితాలు బాగుపడ్డాయో తెలీదు గానీ.. కొంతమంది పరువు మాత్రం బజారున పడుతోంది. మరీ ముఖ్యంగా కథానాయికలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. చాలాఏళ్ల క్రితం ఓ కథానాయిక బాత్రూమ్ స్నానం చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. దాంతో యావత్ సినీ ప్రపంచం ఖంగుతింది. ఆ వీడియో వైరస్ కంటే వేగంగా పాకింది. ఆ వీడియోని ఆధారంగా చేసుకొని.. టీవీ చానళ్లు ప్రత్యేక కార్యక్రమాల్ని ప్రసారం చేస్తూ తమ టీఆర్‌పీ రేటింగులు పెంచుకోవాలని చూశారు. అప్పటి నుంచి కథానాయికలకు సీక్రెట్ కెమెరాలంటే భయం పట్టుకొంది. కొంతకాలం అలాంటి అకృత్యాలేం జరగలేదు. మళ్లీ ఈమధ్య ఈ వెర్రిపోకడలు మరింత ఉథృతమయ్యాయి. రాధికా ఆప్టే బాత్రూమ్ దృశ్యాలు కూడా బయటకు వచ్చి.. ఇంటర్నెట్‌లో హల్ చల్ చేశాయి. ఆ ఫొటోలు నావి కావంటూ రాధికా బదులిచ్చేవరకూ ఈ వ్యవహారం నడిచింది.
ఇప్పుడు మరో కథానాయిక బాత్రూమ్‌లో స్నానం చేస్తున్న వీడియో క్లిప్పింగు బయట తిరుగుతోంది. తమిళ ప్రజలు ఖుష్బూ తరవాత ఖుష్బూ అని ఆరాధించే నటీ ఆమె. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించి మంచి పేరు తెచ్చుకొంది. ఆమె వీడియోలు బయటకు ఎలా వచ్చాయో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏదో సరదాకి తీసుకొన్న ఫొటోలు అనుకోకుండా లీక్ అవ్వడం ఒక బాధైతే, ఎవరో కావాలని ఇలా కథానాయికల పరువు బజారు కీర్చడానికి చూడడం మరోరకమైన సమస్య. మొత్తానికి సాంకేతిక పరిజ్ఞానం చేసిన పాపాలు ఏ రీతిన ఉంటాయనేదానికి ఉదాహరణలే ఇవన్నీ. ఇప్పటికైనా కథానాయికలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి అరాచక కార్యక్రమాలకు పాల్పడుతున్నవారికి ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి. ఆ రోజులు ఎప్పుడొస్తాయో..??