English | Telugu

'కోర్ట్' దర్శకుడితో నాని మరో మూవీ.. రంగంలోకి స్టార్ హీరో!

'కోర్ట్' దర్శకుడితో నాని మరో మూవీ.. రంగంలోకి స్టార్ హీరో!

 

ఓ వైపు హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతూనే, మరోవైపు నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు నాని (Nani). ఇటీవల 'కోర్ట్', 'హిట్-3' సినిమాలతో నిర్మాతగా విజయాలను అందుకున్నాడు. ముఖ్యంగా చిన్న సినిమాగా వచ్చిన 'కోర్ట్' పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు 'కోర్ట్' దర్శకుడు రామ్ జగదీష్ తో నాని మరో సినిమాని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటించనున్నాడని సమాచారం.

 

తెలుగులో 'మహానటి', 'సీతారామం', 'లక్కీ భాస్కర్' సినిమాలతో మెప్పించి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న దుల్కర్ సల్మాన్.. ప్రస్తుతం పవన్ సాదినేని దర్శకత్వంలో 'ఆకాశంలో ఒక తార' చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత నాని నిర్మాతగా రామ్ జగదీష్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశముంది. ఇప్పటికే కథా చర్చలు మొదలయ్యాయని, త్వరలోనే ప్రాజెక్ట్ లాక్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

 

నాని నిర్మాతగానూ వరుస సినిమాలు చేసేలా ఉన్నాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఓ సినిమాని ప్రకటించాడు. ఇప్పుడు దుల్కర్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. మున్ముందు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెడతాడేమో చూడాలి.

 

 

'కోర్ట్' దర్శకుడితో నాని మరో మూవీ.. రంగంలోకి స్టార్ హీరో!