English | Telugu

బాబాయ్‌కి ఫ్లాప్ ఇచ్చాడు.. మ‌రి అబ్బాయ్‌కి??

సినిమా ఇండ్ర‌స్ట్రీలో ఎప్పుడు ఎవ‌రి ఫేట్ ఎలా తిరుగుతుందో చెప్ప‌లేం. ఫ్లాప్ లో ఉన్న‌వాళ్లు స‌డ‌న్‌గా ఓ బంప‌ర్ హిట్ కొట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తారు. హిట్ బాట‌లో ఉన్న‌వాళ్లు అట్ట‌ర్ ఫ్లాప్ ఇచ్చి... షాకిస్తారు. ఏ.ఎస్. ర‌వికుమార్ జీవిత‌మూ అంతే. ర‌చ‌యిత‌గా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన ర‌వికుమార్ చౌద‌రి - య‌జ్ఞంలాంటి సూప‌ర్ హిట్ తీశాడు. ఆ త‌ర‌వాత నంద‌మూరి బాల‌కృష్ణ నుంచి పిలుపు అందుకొంది. ఇక మ‌నోడు టాప్ లిస్టులో చేరిపోవ‌డం ఖాయ‌మ‌నుకొన్నారంతా. కానీ.. వీర‌భ‌ద్ర అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో... కెరీర్ ఒక్క‌సారిగా డౌన్ అయిపోయింది. నితిన్‌, త‌నీష్‌ల‌తో సినిమాలు చేసినా ఉప‌యోగం లేకుండా పోయింది. ఆ త‌ర‌వాత పిల్లా నువ్వు లేని జీవితంతో.. మ‌ళ్లీ గాడిన ప‌డ్డాడు. ఇప్పుడు మ‌రో నంద‌మూరి హీరో నుంచి పిలుపు అందుకొన్నాడు. ప‌టాస్ తో జోరుమీదున్నాడు క‌ల్యాణ్ రామ్‌. ఇప్పుడు ర‌వికుమార్ చెప్పిన క‌థ ఓకే చేశాడ‌ట‌. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తార‌ని టాక్‌. మ‌రి బాబాయ్‌కి ఫ్లాప్ ఇచ్చిన ఈ ద‌ర్శ‌కుడు.. అబ్బాయికి ఎలాంటి షాక్ ఇస్తాడ‌న్న‌ది నంద‌మూరి అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. షేర్ సినిమాతో బిజీగా ఉన్న‌క‌ల్యాణ్‌రామ్‌.. ఆ సినిమా పూర్త‌యిన వెంట‌నే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తాడ‌ని తెలిసింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.