English | Telugu

దిల్‌ రాజు వీడియో వైరల్‌... అందరూ షాక్‌.. ఇలా కూడా చేస్తాడా?

సినిమా పంపిణీ రంగంలో విశేషమైన అనుభవం గడిరచిన వెంకట రమణారెడ్డిని అందరూ ముద్దుగా రాజు అని పిలిచేవారు. డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ అయిన తర్వాత ‘దిల్‌’ చిత్రాన్ని నిర్మించి తొలి సినిమాతోనే సూపర్‌హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత దిల్‌ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకొని దిల్‌రాజుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 40 సినిమాలను నిర్మించిన దిల్‌రాజు తాజాగా రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే పాన్‌ ఇండియా సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. దిల్‌రాజు నిర్మాతగా విజయం సాధించడం వెనుక కొన్ని కారణాలు వున్నాయి. ప్రేక్షకుల పల్స్‌పై ఒక అవగాహన, పాటలపై మంచి పట్టు, కథను జడ్జ్‌ చేసే సామర్థ్యం.. వీటన్నింటి వల్ల అతని కెరీర్‌లో ఎక్కువ శాతం సక్సెస్‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే అతనిలో మరో టాలెంట్‌ కూడా ఉందని ఓ వీడియో ద్వారా తెలిసింది. అదేమిటంటే సింగింగ్‌ టాలెంట్‌.
నాగచైతన్య హీరోగా వాసువర్మ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘జోష్‌’ చిత్రంలో దిల్‌రాజు ఓ పాట పాడాడు. ఇది చాలా మంది తెలీదు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటికి రావడం వల్ల ఈ విషయం అందరికీ తెలిసింది. ఓ టీవీ ఛానల్‌ రాఘవేంద్రరావు నిర్వహించే కార్యక్రమానికి ఆమధ్య అల్లు అర్జున్‌, దిల్‌రాజు, ఛోటా కె.నాయుడు హాజరయ్యారు. ఆ సందర్భంలో ‘నువ్వు పాటలు కూడా పాడతావట కదా’ అని ప్రశ్నిస్తూ దిల్‌రాజు పాడిన పాటను స్క్రీన్‌పై వేశారు. ‘అన్నయ్యొచ్చినాడో.. వెలుగుల వెన్నెల్‌ తెచ్చినాడో’ అంటూ సాగే పాటను దిల్‌రాజు ఎంతో జోష్‌తో పాడాడు. అప్పట్లో ఆ పాట ఫేమస్‌ కూడా అయింది. అయితే అది దిల్‌రాజు పాడిన పాట అని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. చాలా కాలం తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో బయటికి రావడం వల్ల దిల్‌రాజులో ఉన్న సింగింగ్‌ టాలెంట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.