English | Telugu
దేవిశ్రీప్రసాద్ తండ్రి రచయిత సత్యమూర్తి ఇకలేరు
Updated : Dec 14, 2015
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రి, ప్రముఖ సినీ రచయిత సత్యమూర్తి గుండెపోటుతో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. సత్యమూర్తి సుమారు 90 చిత్రాలకు రచయితగా పనిచేసి, తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. 'దేవత', 'ఛాలెంజ్', 'భలే దొంగ', 'అభిలాష', తదితర చిత్రాలు సత్యమూర్తికి పేరు ప్రఖ్యాతులు అందించాయి. సినీ రంగంలో రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న సత్యమూర్తితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వ్యక్తిగతంగా తమకు సత్యమూర్తి మరణం తీరని లోటు అనీ, తెలుగు సినీ పరిశ్రమ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందనీ పలువురు సినీ ప్రముఖులు వ్యాఖ్యానించారు. ఇకపోతే సత్యమూర్తి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం చెన్నైలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సత్యమూర్తి గారి మృతికి తెలుగువన్ ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది.