Read more!

English | Telugu

ఓటీటీలోకి డియర్ మూవీ!

ప్రతీవారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కంటే ఓటీటీలోకి వచ్చే సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో తమిళ, మలయాళ, హిందీ సినిమాలు పోటీ పడీ మరి వస్తున్నాయి. అయితే ఇందులో కాస్త భిన్నంగా ఉండే సినిమాలకి క్రేజ్ ఎక్కువగా ఉంటుంది.

గత సంవత్సరంలో 'గుడ్ నైట్' పేరుతో తమిళంతో పాటు తెలుగులో ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాలో హీరో పడుకున్న తర్వాత గురక వస్తుంటుంది. అది తన పక్కన పడుకున్నవారికి తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకంటే అచ్చం అదే తరహాలో 'డియర్' మూవీని తీసుకొచ్చారు మేకర్స్. జి.వి ప్రకాష్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'డియర్'. ఈ సినిమా ఈ నెల 11న తమిళంలో 12న తెలుగులో రిలీజ్ అయ్యింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు(ఏప్రిల్ 28) నుండి స్ట్రీమింగ్ అవుతోంది. జి.వి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టరే కాదు హీరోగా సపోర్టింగ్ రోల్ గా చేస్తూ మెప్పిస్తున్నాడు. థియేటర్లలో ఈ సినిమాని చూడనివాళ్ళు ఓసారి చూసేయ్యండి. 

ఓ టెలివిజన్ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా జాబ్ సంపాదించి ప్రముఖులని ఇంటర్వ్యూ లు చేయాలనేది అర్జున్(జి.వి ప్రకాష్) కల‌‌. అయితే అతనికి పడుకున్న తర్వాత చిన్న శబ్దం వినపడినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అదే సమయంలో నిద్రపోయాక గురకపెడుతుంటుంది దీపిక(ఐశ్వర్య రాజేష్). ఈ ఇద్దరు ఒకరి సమస్య ఒకరికి తెలియకుండా పెళ్ళి చేసుకుంటారు. మరి పెళ్ళి తర్వాత ఒకరి సమస్య ఒకరికి తెలిసిందా? వాళ్ళిద్దరి కలిసి ఉండగలిగారా లేదా అనేది మిగతా కథ.. ఈ రోజు నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాని ఓ సారి చూసేయ్యండి.