Read more!

English | Telugu

మెగా సినిమాలో మెగా ఫ్యామిలీ మొత్తం..!!

మెగాస్టార్ రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న "మెగా 150" వ సినిమా గురువారం నుంచి సెట్స్ కు వెళ్లింది. ముందుగా ఇంట్రడక్షన్ సీన్ తో షూటింగ్ స్టార్ట్ చేశారు. షూటింగ్ మొదటిరోజు సెట్లో మెగా అభిమానులు, మెగా కుటుంబ సభ్యులు నిండిపోయారు. అయితే.. అన్నిటికంటే జనాల్ని ఎక్కువగా ఆకర్షించింది చిరంజీవి స్టైల్ అండ్ డ్రెస్సింగ్. 60 లోనూ చిరు 40లా కనిపిస్తున్నాడు. అందుకు కారణం ఆయన కుమార్తె అని తెలుస్తోంది. చిరంజీవి నటించిన "శంకర్ దాదా జిందాబాద్" చిత్రానికి కాస్ట్యూమ్స్ మరియు స్టైలింగ్ చేసిన చిరు తనయ సుస్మిత.. చిరంజీవి రీఎంట్రీ సినిమాకి కూడా సుస్మితే స్టైలింగ్ బాధ్యత చేప్పటింది. అందువల్ల చిరు మరింత అందంగా కనిపిస్తున్నాడు. వివి.వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం కథానాయకి ఎంపిక జరుగుతోంది.