Read more!

English | Telugu

దర్శకుడిగా మారుతున్న మరో రచయిత!

రచయితలు దర్శకులుగా మారడామన్నది తెలుగులో మాత్రమే కాదు ప్రతి ఇండస్ట్రీలో సర్వసాధారణం. అయితే.. తెలుగులో ఈ ఒరవడి ప్రస్తుతం ఉధృతమైంది. త్వరలో దర్శకుడిగా మారుతున్న రచయిత గురించి మనం ఇక్కడ మాట్లాడు కుంటున్నాం. అతడి పేరు వెలిగొండ శ్రీనివాస్. రచయితగా భారీ హిట్లు లేకపోవడం అటుంచితే.. "అఖిల్" సినిమాకి రైటర్ గా పనిచేసి, ఆ సినిమా డిజాస్టర్ లో కీలకపాత్ర పోషించాడు. అటువంటి రచయితకి దర్శకుడిగా అవకాశమొచ్చింది. ఇటీవల ఎకె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థకు శ్రీనివాస్ ఓ కథ చెప్పాడని, మంచి యూత్ ఫుల్ సబ్జెక్ట్ కావడంతో.. తమ దగ్గర ఎలాగూ రాజ్ తరుణ్ డేట్స్ ఉన్నాయి కాబట్టి, అతడినే హీరోగా పెట్టి ఆ సినిమాను తెరకెక్కించాలని కోరారట. ప్రస్తుతం వెలిగొండ శ్రీనివాస్ స్క్రిప్ట్ ను మెరుగులు దిద్దుతున్నాడట. ఈ ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ కు వెళుతుందని వినికిడి!