English | Telugu

చిరు అంతలా ఇరగదీశాడా??

నూట‌యాభైవ సినిమా అంటే.. నిజంగా గొప్ప మైలురాయే. అన్ని సినిమాలు చేయ‌డం.... అరుదైన విష‌య‌మే. ఏ న‌టుడైనా ఆ సినిమాని ఆర్భాటంగా జ‌నం ముందుకు తీసుకొస్తాడు. సినిమా అంతా తానై న‌డిపించుకొంటాడు. అభిమానుల్ని అల‌రించ‌డానికి.. ఆ సినిమాని ఓ వేదిక గా చేసుకొంటాడు. కానీ..చిరంజీవి ఇవేం ప‌ట్టించుకోలేదు. బ్రూస్లీని ఆదుకోవ‌డానికి రంగంలోకి దిగాడు. మగ‌ధీర త‌న 149వ చిత్రం. ఆ త‌ర‌వాత న‌టించింది.. బ్రూస్లీనే. అంటే.. సంఖ్యాప‌రంగా ఇదే చిరు 150వ సినిమా.

150వ సినిమాలో చిరు మూడు నిమిషాల పాత్ర‌కి ప‌రిమితం అవ్వ‌డం చిరంజీవి అభిమానుల‌కు కూడా న‌చ్చ‌ని విష‌య‌మే. అందుకే చ‌ర‌ణ్ తెలివిగా.. డాడీ 150వ సినిమాకి ఇది టీజ‌ర్ మాత్ర‌మే, అని క‌ల‌రింగు ఇచ్చాడు. ఎంత మ‌సి పూసి మారేడు కాయ చేసినా.. లెక్క ప్ర‌కారం ఇదే చిరు 150వ సినిమా. ఆ సంగ‌తి చిరుకీ తెలుసు. కానీ.. కొడుకు కోసం చిరు త్యాగం చేసుకొన్నాడు. ఈ సినిమాలో చిరు ఎంట్రీ అవ‌శ్య‌మ‌ని నిర్మాత అభిప్రాయం. ఎందుకంటే చిరు ఎంట్రీ ఇస్తే.. అభిమానుల‌కు అది కావ‌ల్సినంత కిక్ ఇస్తుంది.

మూడు నిమిషాల పాత్రే అయినా... రిపీట్ ఆడియ‌న్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. చిరు కోస‌మైనా జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తారు. అందుకే చిరు ఈ సాహ‌సం చేశాడు. ఇప్పుడు బ్రూస్లీ చూసినోళ్లంతా.. సినిమా ఏమీ లేక‌పోయినా చిరు ఎంట్రీ అదిరిపోయిందంటున్నారు. ఆ మూడు నిమిషాలూ పండ‌గ‌లా ఉంది అని కితాబిస్తున్నారు. ఇప్పుడు బ్రూస్లీని కాపాడ‌వ‌ల‌సింది చిరంజీవే. చిరు ఉన్నా.. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర గ‌ట్టెక్క‌లేదంటే... చిరు చేసిన త్యాగం వృథా అయిన‌ట్టే. మ‌రి ఏం జ‌రుగుతుందో, చిరు చేసిన ఈ త్యాగానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ఏమిటో బాక్సాఫీసే తేల్చి చెప్పాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.