English | Telugu

బాలకృష్ణ లాగా చిరంజీవి, నాగార్జున లకి క్రమశిక్షణ లో అవగాహనలేదా!

బాలకృష్ణ లాగా చిరంజీవి, నాగార్జున లకి క్రమశిక్షణ లో అవగాహనలేదా!

సో...సో...సో.. సోషల్ మీడియా.. ఇది ఏ ముహూర్తాన భూమండలంలోకి  అడుగుపెట్టిందో గాని బాహుబలి కి అమ్మ మొగుడై కూర్చుంది. ఎంతో మంది సెలబ్రిటీస్ ని వాళ్ళ  ప్రమేయం లేకుండానే  పది మంది నోళ్ళల్లో నానేలా చేస్తుంది. ఇక ఆ సెలబ్రిటీస్ లిస్ట్ లో సినీ స్టార్స్ ఉంటే. అందులోను మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)ఉంటే. సోషల్ మీడియా  ఒక రేంజ్ లో షేక్ అవుతుంది కదు.. ఇప్పుడు అదే జరుగుతుంది. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.

 పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్ క్రీడల మహోత్సవానికి చిరు  హాజరయ్యిన విషయం అందరకి తెలిసిందే.అందుకు సంబంధించిన ఫోటోలు అన్నిఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కూడా కొడుతున్నాయి పైగా తన శ్రీమతి సురేఖ తో కలిసి ఒలింపిక్ జ్యోతిని  కూడా పట్టుకొని ట్రెండింగ్ గా కూడా నిలిచాడు.  చరణ్(ram charan)ఉపాసన,కూడా చిరుతో పాటు పాల్గొనడంతో కొన్ని రోజుల నుంచి మెగా అభిమానుల దృష్టి మొత్తం పారిస్ మీదనే ఉంది. ఇక తాజాగా  పారిస్ టూర్ ముగించుకొని చిరు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి  బయటకు వస్తున్న  క్రమంలో ఇండిగో ఎయిర్ లైన్స్ కి చెందిన ఒక ఉద్యోగి చిరు తో సెల్ఫీ దిగిందేకు ప్రయత్నించాడు. ఆ  సూచనని పట్టించుకోని చిరు  అతని వీపు మీద చేయి వేసి పక్కకి నెట్టాడు. ఇప్పుడు దీని తాలూకు  వీడియోనే  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైగా అభిమాని అడిగితే  సెల్ఫీ ఇవ్వని  చిరు అంటు  ట్రోల్ చేస్తున్నారు. అదే టైం లో చిరు కి మద్దతుగా నిలుస్తున్న వాళ్ళు లేకపోలేదు. బిజీ షెడ్యూల్స్ ని ముగించుకొని  చిరు  హడావిడిగా ఇంటికి వెళ్తున్నాడని  వీడియోలో క్లియర్ కనపడుతుంది. మూడ్ ఎలా ఉందో ఆలోచించకుండా సెల్ఫీ అడగడం తప్పే కదా  అని అంటున్నారు.

 కొన్ని రోజుల క్రితం యువసామ్రాట్ నాగార్జున(nagarjuna)కూడా  ఇదే రీతిలో ట్రోల్ అయ్యాడు. ముంబై ఎయిర్ పోర్ట్ లో వెళ్తుంటే ఎయిర్ పోర్ట్ లో పని చేసే ఒక వ్యకి నాగ్ తో  సెల్ఫీ దిగాలని ట్రై చేసాడు. వెంటనే  నాగ్ పర్సనల్ సిబ్బంది అతన్ని పక్కకు నెట్టేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా దెబ్బకి నాగ్  అతన్ని పిలిపించుకొని సెల్ఫీ దిగాడు. మరి ఇప్పుడు చిరు కూడా ఆ ప్రొజిజర్ నే ఫాలో అవుతాడేమో చూడాలి. ఏది ఏమైనా తక్కువ రోజుల వ్యవధిలో  ఇద్దరు అగ్ర హీరోలు సేమ్ ఒకే మ్యాటర్ లో ట్రోల్ అవ్వడం విశేషం.ఇక నెట్టింట ఇంకో విధమైన చర్చ కూడా నడుస్తుంది. నందమూరి నటసింహం బాలయ్య(balayya)కి అదే పరిస్థితి ఎదురైతే అభిమానులకి  క్రమ శిక్షణ నేర్పేవాడని అంటున్నారు. 

 

బాలకృష్ణ లాగా చిరంజీవి, నాగార్జున లకి క్రమశిక్షణ లో అవగాహనలేదా!