Read more!

English | Telugu

'కార్తికేయ' చూడకపోయినా పర్లేదు!

ఏదైనా మూవీకి సీక్వెల్ వస్తుందంటే.. ముందుగా మొదటి భాగాన్ని చూడాలని, అప్పుడు తమ సినిమా ఎక్కువ కనెక్ట్ అవుతుందని మూవీ టీమ్ చెబుతుంటుంది. కానీ డైరెక్టర్ చందు మొండేటి మాత్రం 'కార్తికేయ' చూడని వాళ్ళకి కూడా 'కార్తికేయ-2' అర్థమవుతుందని అంటున్నాడు.

 

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'కార్తికేయ' 2014లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తున్న 'కార్తికేయ-2' ఆగస్టు 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంతో తాజాగా మీడియాతో ముచ్చటించిన చందు.. 'కార్తికేయ' చూడని వాళ్ళకి కూడా 'కార్తికేయ-2' అర్థమవుతుందని, దీనిని ఒక సెపరేట్ ఫిల్మ్ లా కూడా చూడొచ్చని అన్నాడు. అందులో హీరో మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తే, ఇందులో డాక్టర్ గా కనిపిస్తాడు. హీరో క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుందని.. హీరోకి క్యూరియాసిటీ ఉంటుందని, ఏదైనా తెలుసుకోవడం ఎంతదూరమైనా వెళ్తాడనేది ఇందులో కూడా చూపిస్తామని తెలిపాడు. 'కార్తికేయ' టైంలోనే ఈ క్యారెక్టరైజేషన్ తో మరికొన్ని సినిమాలు చేయాలని అనుకున్నామని చెప్పాడు. 'కార్తికేయ-2'ను ఒక కొత్త సినిమాలా చూస్తే ఇంకా ఎక్కువ నచ్చుతుందని చందు అన్నాడు. థియేటర్స్ కౌంట్ గురించి, రిజల్ట్ గురించి టెన్షన్ లేదని.. ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంటుందని టీమ్ అందరికి నమ్మకం ఉందని చందు చెప్పుకొచ్చాడు. 

 

 

అలాగే, తాను నెక్స్ట్ మూవీని గీతా ఆర్ట్స్ లో చేయబోతున్నట్లు చందు చెప్పాడు. రెండు స్టోరీలు అనుకున్నామని, ఒకటి ప్రేమకథా చిత్రమైంటే ఇంకొకటి సోషల్ డ్రామా అని తెలిపాడు. ఆ రెండు కథలు అరవింద్ గారికి నచ్చాయని..  త్వరలోనే మిగతా డీటెయిల్స్ చెప్తామని అన్నాడు. గీతా ఆర్ట్స్ తరువాత నాగార్జున గారితో మరో చిత్రం చేయబోతున్నట్లు చెప్పాడు.