English | Telugu

తెలుగు సినిమాని 100 కోట్లకు తెచ్చే హీరో మహేష్

తెలుగు సినిమాని 100 కోట్లకు తెచ్చే హీరో మహేష్ బాబు అని ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి అన్నారు. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, మనసున్న మంచి నిర్మాత డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్నన చిత్రం "బిజినెస్ మ్యాన్".

ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం ఆడియో విడుదల సందర్భంలో ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి ప్రసంగిస్తూ "సూపర్ స్టార్ కృష్ణ గారిని చూస్తే కడుపునిండిపోతుంది. అలాగే ప్రిన్స్ మహేష్ బాబుని చూసినా కూడా అలాగే అనిపిస్తుంది. తెలుగు సినిమా స్టామినాని 100 కోట్లకు తీసుకెళ్ళగల సత్తా ఉన్న హీరో మహేష్ బాబు. ఆయన నటిస్తున్న ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం పేద్ద హిట్టవ్వాలని కోర్యకుంటున్నాను" అని అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.