English | Telugu

బాహుబలి 'శాటిలైట్' అమ్ముడుపోలేదు

బాహుబలి శాటిలైట్ రైట్స్ టాలీవుడ్ లోనే రికార్డ్ ధరకు అమ్ముడుపోయిందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజంకాదని తెలుస్తోంది. బాహుబలి శాటిలైట్ ని రాజమౌళి అండ్ కో భారీ ధరకు అమ్మాలని డిసైడ్ అయ్యారట.

కానీ చానెల్ వాళ్లు మాత్రం 16 కోట్లు ఇస్తామని అంటున్నారట. సినిమా మీద కాన్ఫిడెన్స్ తో పాతిక కోట్లకు తగ్గేదిలేదని బాహుబలి టీమ్ డిమాండ్ చేస్తున్నారట.. సినిమా రిలీజ్ అయితే అదే ధర ఈజీగా దక్కుతుందని వారు భావిస్తున్నారట. మరి సినిమా రిలీజ్ తరువాత బాహుబలి టీమ్ ఆశిస్తున్న రేట్ దక్కుంతుందా? లేదా? అన్నది ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తిగా మారింది.

ఇదిలా వుండగా..బాహుబలి జూలై 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి సిద్దంగా వుంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ ధియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.