English | Telugu

'బాహుబ‌లి'పై నెగిటివ్ టాక్ మొదలైంది

ఇప్ప‌టి వ‌ర‌కూ Bahubali పై బీభ‌త్స‌మైన పాజిటీవ్ టాక్ న‌డిచింది. ఈ సినిమా ఓ క్లాసిక్ అని, ఇండియ‌న్ అవ‌తార్ అని చెప్పుకొన్నారు. ఇటీవ‌ల బాహుబ‌లి సెన్సార్ జ‌రిగిన‌ప్ప‌టి నుంచీ... మెల్ల‌గా నెగిటీవ్ టాక్ కూడా ఊపందుకొంటోంది. ఈసినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా లేద‌ని, భారీ ఆశ‌ల‌తో థియేట‌ర్ల‌కు వెళితే నిరుత్సాహ‌ప‌డ‌డం ఖాయ‌మ‌నే టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌, వార్ ఎపిసోడ్ మిన‌హా `బాహుబ‌లి`లో ఏమీ లేద‌ని కేవ‌లం ఈ సినిమా విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తోనే న‌డుస్తుంద‌ని, సెంటిమెంట్ గోల ఎక్కువైంద‌ని.. ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లొస్తున్నాయి. ఈ వార్త‌లు చిత్ర‌బృందంలో క‌ల‌వ‌రం రేపుతున్నాయి. స‌డ‌న్ గా వ‌చ్చిన ఈనెగిటీవ్ టాక్ ని ఎలా తిప్పుకొట్టాలో రాజ‌మౌళికి సైతం అర్థం కావ‌డం లేదు. అయితే ఒక‌ర‌కంగా ఈ నెటిటీవ్ ప్ర‌చారం కూడా మంచిదే అని రాజ‌మౌళి భావిస్తున్నాడ‌ట‌.

ఇప్ప‌టికే ఈసినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయ‌ని, నెగిటీవ్ టాక్ వ‌ల్ల అవి కాస్త త‌గ్గి సినిమాని సినిమాలా చూస్తార‌ని రాజ‌మౌళి ఓ అంచ‌నాకు వ‌స్తున్నాడ‌ట‌. మ‌రి ఈ నెగిటీవ్ టాక్ సినిమాపై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపిస్తుందో..?

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.