English | Telugu

అవతార్ 2 రీ రిలీజ్ డేట్ పై టెన్షన్.. కండిషన్స్ తెలిసి షాక్ 

అవతార్ 2 రీ రిలీజ్ డేట్ పై టెన్షన్.. కండిషన్స్ తెలిసి షాక్ 

ప్రపంచ సినీ పితామహుడిగా అభిమానుల చేత కీర్తించబడే దర్శకుడు జేమ్స్ కేమరూన్(James Cameron). ఆయన దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలు ప్రపంచ సినీ ప్రేమికులని ఎంతగానో అలరించడమే కాకుండా, విజువల్ గా కూడా ఒక సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసాయి. అలాంటి వాటిల్లో 'అవతార్(Avatar)సిరీస్' కూడా ఒకటి. ఇప్పటి వరకు రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఫైర్ అండ్ ఆష్ గా తెరకెక్కుతున్న అవతార్ పార్ట్ 3 (Avatar part 3)ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, డిసెంబర్ 19 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

ఇక మేకర్స్  ఈ లోపు  పార్ట్ 2(Avatar part 2)ని రీ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 3 న రీ రిలీజ్ చేస్తున్నట్టు అధికార ప్రకటన కూడా వారి నుంచి వచ్చింది. కాకపోతే వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందా, లేక కేవలం ఓవర్సీస్ మార్కెట్ లోనేనా అనేది వెల్లడి చెయ్యలేదు. పైగా ఒక్క వారం మాత్రమే లిమిటెడ్ ఎంగేజ్మెంట్ గా థియేటర్స్ లో ఉంటున్నట్టుగా కూడా ప్రకటించారు. మరి ఈ విషయంపై  మరికొన్ని రోజుల్లో  క్లారిటీ వచ్చే అవకాశముంటుందేమో చూడాలి. 

ప్రస్తుతం చాలా చిత్రాలు  రీ రిలీజ్ లో మంచి కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవతార్ పార్ట్ 2 రీ రిలీజ్ లో  రికార్డు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంటుందని సినీ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. భార్య భర్తలైన జేక్ సల్లీ, నైతిరి తమ పిల్లలతో కలిసి ఓమాటికా తెగకు నాయకత్వం వహిస్తు, పండోరా గ్రహంపై ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించటానికి ప్రయత్నిస్తుంటారు. అయితే  భూమి నుండి వచ్చిన మానవులు పండోరా గ్రహంపైకి వచ్చి వారిని ఇబ్బందులకి గురి చేస్తారు. ఈ క్రమంలో జేక్ సల్లీ, నైతిరి కుటుంబంతో పాటు,తమ కొత్త ప్రపంచాన్ని ఏ విధంగా కాపాడుకున్నారనే కథాంశంతో పార్ట్ 2 తెరకెక్కింది.

 

 

 

అవతార్ 2 రీ రిలీజ్ డేట్ పై టెన్షన్.. కండిషన్స్ తెలిసి షాక్