English | Telugu
ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి మృతి
Updated : Jun 11, 2025
గోపీచంద్ ని హీరోగా నిలబెట్టిన చిత్రం 'యజ్ఞం'. 2004 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ గా నిలవడంతో పాటు తెలుగు సినిమాకి సరికొత్త కథ, కథనాల్ని అందించింది. ఈ మూవీ ద్వారానే ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు ఏఎస్ రవికుమార్ చౌదరి(As Ravikumar Chowdary). డిఫరెంట్ టేకింగ్ కి పెట్టింది పేరైన చౌదరి ఆ తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం, వీరభద్రం, సౌఖ్యం, ఆటాడిస్తా వంటి చిత్రాలతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాడు.
రీసెంట్ గా ఏఎస్ రవికుమార్ చౌదరి చనిపోవడం జరిగింది. కార్డియాక్ అరెస్ట్ కి గురవ్వడంతో నిన్న రాత్రి మృతి చెందినట్టుగా తెలుస్తుంది. కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటు వస్తున్న చౌదరి కొన్ని రోజుల నుంచి మానసిక ఒత్తిడితో ఉంటున్నాడని, అందువల్లనే స్ట్రోక్ కి గురయ్యి మరణించినట్టుగా సన్నిహితులు చెప్తున్నారు. ఆయన మరణానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చౌదరి చివరగా 'తిరగబడరా స్వామి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత ఏడాది అగస్ట్ లో రిలీజ్ అవ్వగా రాజ్ తరుణ్ హీరోగా చేసాడు. మరో కొత్త మూవీ సన్నాహాల్లో ఉండగానే చౌదరి మరణించడం జరిగింది. ఇక చౌదరి మృతి పట్ల తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. చౌదరి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలికి దగ్గరలో ఉన్న నారాకోడూరు.
