English | Telugu

ఒక్క రానా తో తప్ప అందరితో.. అనుష్క

సినిమా రంగంలో హీరోల సంగతేమో కాని హీరోయిన్ లకు మాత్రం నటించిన వారందరితో ఎఫైర్లు అంటకట్టడం సహజం. అది టాప్ హీరోయిన్లు అయినా సరే.. వారు ఈ ఎఫైర్ల పుకార్లకు బలైపోతుంటారు. అలా తనని కూడా అందరి హీరోలతో లింకులు పెట్టేశారు అంటుంది అటు టాలీవుడ్ లో ఇటు కోలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నఅనుష్క. అనుష్క సూర్య జంటగా నటించిన "సింగం" సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వచ్చిన "సింగం-2" కోలీవుడ్ లో మంచి విజయం సాధించిన టాలీవుడ్ లో మాత్రం యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ "సింగం-3" సినిమా తెరకెక్కనున్న నేపథ్యంలో అనుష్క ఆ సినిమా వివరాల గురించి తెలిపారు. ఈ సినిమాలో అనుష్కది ప్రధాన పాత్ర కాగా రెండో నాయికగా అందాల తార శృతిహాసన్ తన అందాల ఆరబోతకు సిద్దమైంది. ఈ సందర్బంగా అనుష్కను ఆర్యతో మీ ఎఫైర్ సంగతేంటని అడగగా ఈ రంగంలో ఇవన్నీ మామూలే.. ఒక్క ఆర్యతోనే కాదు నేను నటించిన హీరోలందరితో ఎఫైర్లు పెట్టారు.. ఒక్క రానా తప్ప.. ఎందుకంటే తనని నేను అన్నయ్య అని పిలుస్తాను.. తను నన్ను సిస్టర్ అని పిలుస్తాడు కాబట్టి అని ఘాటుగానే సమాధానమిచ్చింది. మొత్తానికి అనుష్క కూడా ఈ లింకులను లైట్ గానే తీసుకున్నట్టుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.