English | Telugu

సైజ్ జీరో.. రాజ‌మౌళి చేతుల్లో

రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కోవెల‌మూడికి సైజ్ జీరోతో హిట్టుకొట్ట‌డం అత్య‌వ‌స‌రం. ఒక‌ప్పుడు హీరోగా ఓ వెలుగు వెలుగుదామ‌ని భావించి.. తొలి సినిమాతోనే అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాడు. ఆ త‌ర‌వాత అన‌గ‌న‌గా ఓ ధీరుడు భారీ స్థాయిలో తెర‌కెక్కించి బాక్సాఫీసు ద‌గ్గ‌ర మాత్రం బోల్తా ప‌డ్డాడు. ఈసారి హిట్టు కొట్ట‌క పోతే, ద‌ర్శ‌కుడిగానూ ఫెయిల్యూర్స్ మోయాల్సివ‌స్తుంది.

అందుకే.. సైజ్ జీరో విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకొంటున్నాడు. ఈ సినిమా విష‌యంలో రాజ‌మౌళి హ‌స్తం కూడా ఉంద‌న్న‌ద‌ని లేటెస్ట్ టాక్‌. సినిమా అంతా పూర్తయ్యాక రాజ‌మౌళి చేతిలో పెట్టాడ‌ట ప్ర‌కాష్‌. ఆయ‌న ఈ సినిమా చూసి, ద‌గ్గ‌రుండి ఎడిట్ చేసి పెట్టాడ‌ని.. సినిమాని ఎక్క‌డ లేపాలో అక్క‌డ లేపాడ‌ని, దాంతో రాజ‌మౌళి మార్క్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ని టాక్‌.

సెన్సార్‌కి వెళ్లే ముందు కూడా ఫైన‌ల్ కాపీ చూసిన రాజ‌మౌళి ఒక‌ట్రెండు మార్పులు చెప్పాడ‌ని, ఇప్పుడంతా క్లియ‌ర్ అయ్యింద‌ని టాక్‌. రాఘ‌వేంద్ర‌రావు శిష్యుడిగా అరంగేట్రం చేసి, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకొన్న జ‌క్క‌న్న‌.. త‌న గురువు రుణం ఇలా తీర్చుకొంటున్నాడ‌న్న‌మాట‌.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.