English | Telugu

అనుష్క కీ అదే షాక్ త‌గులుతుందా?

ఇది వ‌ర‌కు క‌థానాయ‌కుల పారితోషికంతో నిర్మాత‌ల‌కు చుక్క‌లు క‌నిపించేవి. ఇప్పుడు హీరోయిన్లు కూడా వాళ్ల‌తో పోటీకొస్తున్నారు. టాప్ పొజీష‌న్ ద‌క్కితే చాలు.. 'కో.. కో.. కోటి' అంటూ కోడై కూస్తున్నారు. స్టార్ క‌థానాయిక కావాలంటే ఆ మాత్రం ఇచ్చుకోక త‌ప్ప‌డం లేదు. ఇప్పుడు.. క‌థానాయిక‌లూ తెలివి మీరారు. 'హీరోల్లానే మాకూ లాభాల్లో వాటా కావాల‌'ని డిమాండ్ చేస్తున్నారు.

మొన్న‌టికి మొన్న 'జ్యోతిల‌క్ష్మి' కోసం ఛార్మి పారితోషికం తీసుకోకుండా వాటా అడిగింది. చివ‌రికి ఆమెకు రిక్త హ‌స్తాలే మిగిలాయ్ అనుకోండి.. అది వేరే విష‌యం. ఇప్పుడు అనుష్క కూడా అదే పాట పాడుతోంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు న‌టిస్తున్న చిత్రం సైజ్ జీరో. సినిమా అంతా అనుష్క చుట్టూనే తిరుగుతుంది. కాల్షీట్లు కూడా భారీగానే కేటాయించింది. మామూలుగా అయితే.. ఈ సినిమాకి రెండు కోట్ల వ‌ర‌కూ పారితోషికం అందుకోవ‌చ్చు. కానీ అనుష్క మాత్రం పారితోషికం వ‌ద్దు.. లాభాల్లో వాటా కావాలంద‌ట‌.

ఎందుకంటే ప‌రిమిత బ‌డ్జెట్‌లో తెర‌కెక్కిన చిత్ర‌మిది. తెలుగు, త‌మిళం రెండు వైపుల నుంచీ మార్కెట్ ఉండేలా చూసుకొన్నారు. క‌నీసం రెండు చోట్లా రూ.30 కోట్లు వ‌చ్చినా.. అనుష్క‌కి బాగానే గిట్టుబాటు అవుతుంది. క‌నీసం రూ.4 కోట్ల‌యినా రాబ‌ట్టుకోవ‌చ్చు. అందుకే... అనుష్క 'వాటా' వైపే మొగ్గుచూపింద‌ట‌. సినిమా వ‌ర్క‌వుట్ అయితే ప‌ర్వాలేదు.. అనుకొన్న సొమ్ము వ‌స్తుంది. వ‌ర్ణ‌లా వాష‌వుట్ అయితే మాత్రం.. ఛార్మికి పట్టిన గ‌తే ప‌డుతుంది. ఆ విష‌యం తెలీయ‌ట్లేదు అమ్మ‌డికి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.