English | Telugu

'బాహుబలి' అనుష్క షాకింగ్ లుక్

'బాహుబలి' ప్రమోషన్ ను వినూత్నంగా చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. చిత్రంలోని పాత్రలను ఒకొక్కటిగా రివిల్ చేస్తూ టాక్ అఫ్ ది టౌన్ గా నిలుపుతున్నారు. మొన్న బాల బాహుబలి ని రిలీజ్ చేశారు. నిన్న శివలింగాన్ని మోస్తున్న ప్రబాస్ ను చూపించారు. ఈ రోజు అనుష్క వంతు వచ్చింది. రాజమౌళి రిలీజ్ చేసిన అనుష్క లుక్ అందరిని షాక్ గురి చేసింది. దేవసేన అంటే యువరాణి. ఫస్ట్ లుక్ టీజర్ లో అలానే చూపించారు. కానీ ఈ పోస్టర్ లో మాత్రం ఓ షాకింగ్ గెటప్ ను రివిల్ చేశారు. మాసిపోయిన చీర, చేతికి సంకెళ్ళు, విరబోసిన జట్టుతో అనుష్క పోస్టర్ ను రిలీజ్ చేశారు.'నిప్పులే శ్వాసగా''.. దేవసేన.. అంటున్నారు రాజమౌళి. మొత్తమీద ఈ పోస్టర్లు బాహుబలి కధ విపరీతమైన ఆసక్తిని పెంచేస్తున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.