English | Telugu

ఎమీకి ఎంత కష్టమొచ్చిందో!

కేవలం వలవలు విడిచేస్తే సరిపోదు....క్యారెక్టర్ ను బట్టి లుక్ మార్చుకోవాలి. ఈ విషయం కాస్త తొందరగానే తెలుసుకుంది శంకర్ బ్యూటీ ఎమీజాక్సన్. లేటెస్ట్ హీరోయిన్లలో చాలామంది యాక్షన్ సీన్లలో ఇరగదీసేస్తుంటే నేనేమైనా తక్కువా అని జిమ్ కి దారివెతుక్కుందట. టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోయిన్ గా ఆఫర్స్ దక్కించుకుంటున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో సింగ్ ఈజ్ బ్లింగ్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉండడంతో ఫైట్స్ ప్రాక్టీస్ చేస్తోందట. అసలా పాత్రకు ముందు కృతిసనన్ ను ఎంపికచేశారట. ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో ఎమీకి ఓటేశారు. దీంతో లాక్కున్న క్యారెక్టర్ కాబట్టి కష్టపడకపోతే పరువుపోద్దని ఫిక్సైందట తెల్లపిల్ల. ప్రాక్టీస్ చేస్తే సాధించనిదేముందిలే అంటున్న బీ టౌన్ జనాలకు ఓ డౌట్ వచ్చింది. ఇఫ్పిట వరకూ స్కిన్ షో తో మాత్రమే నెట్టుకొచ్చిన ఈబ్యూటీ యాక్షన్ సీన్స్ లో మెప్పించగలదా అని డిస్కస్ చేసుకుంటున్నారు. మరి చెమటోడ్చుతున్న ఎమీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా వెయిట్ అండ్ సీ.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.