English | Telugu

జూలై 9 న అహ నా పెళ్ళంట 100 డేస్ ఫంక్షన్

జూలై 9 న "అహ నా పెళ్ళంట" 100 డేస్ ఫంక్షన్ ఘనంగా జరపనున్నారు. వివరాల్లోకి వెళితే ఎటివి సమర్పణలో, ఎకెఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, నవ్వుల హీరో అల్లరి నరేష్ హీరోగా, రీతూ బర్మేచ అనే కొత్తమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ, వీరభద్రం చౌదరి అనే నూతన యువకుణ్ణి దర్శకుడిగా పరిచయం చేస్తూ, అనీల్ సుంకర నిర్మించిన పూర్తి హాస్యరస, రొమాంటిక్ కుటుంబకథా చిత్రం "ఆహ నా పెళ్ళం". ఈ సినిమాని ప్రముఖ దర్శకులు స్వర్గీయ ఇవివి సత్యన్నారాయణగారికి అంకితమిచ్చారు. ఇక్కడ విశేషమేమిటంటే ఆయన జయంతికి సరిగ్గా ఒక్కరోజు ముందు, అంటే జూన్ 9 వ తేదీన "అహ నా పెళ్ళంట" 22 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుంది.

అంతేకాకుండా ఈ చిత్ర దర్శకుడు వీరభద్రం చౌదరి కూడా ఇ.వి.వి.సత్యన్నారాయణగారి శిష్యుడే కావటం విశేషం. ఈ సినిమా శతదినోత్సవాన్ని జూలై 9వ తేదీన హైదరాబాద్ లో అత్యంత వైభవంగా నిర్వహించటానికి ఈ చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలియజేయటానికి ఈ చిత్రం యూనిట్ ఫిలిం ఛాంబర్ లో ఒక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో అల్లరి నరేష్, దర్శకుడు వీరభద్రం చౌదరి, సంగీత దర్శకుడు రఘుకుంచె, నటుడు నాగినీడు, ఎగ్జిక్యూటీవ్ నిర్మాత కిషోర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరంతా ఈ చిత్ర విజయానికి సహకరించిన ప్రతిఒక్కరికీ, ముఖ్యంగా ప్రేక్షకులకూ తమ ధన్యవాదాలు తెలిపారు. దివి నుంచి ఇవివి, జంధ్యాల గార్ల ఆశీర్వాదం తమపై ఉండబట్టే ఈ చిత్రం ఇంతటి ఘనవిజయం సాధించిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తమ చిత్ర విజయానికి కారకులైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చిత్ర నిర్మాత అనీల్ సుంకర

పంపిన ఫ్యాక్స్ సందేశాన్ని రఘుకుంచె చదివి వినిపించారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.