Read more!

English | Telugu

ఎన్టీఆర్ రాముడు కాదు.. అల్లరోడు...

ఈ జనరేషన్ లో ఉన్న గొప్ప నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఎటువంటి పాత్రలోనైనా నటించి మెప్పించగల ప్రతిభ ఆయన సొంతం. ఇప్పుడు తనదైన నటనతో అందరినీ సర్ ప్రైజ్ చేస్తున్న ఎన్టీఆర్.. చిన్న వయసులోనే అందరి చేత శభాష్ అనిపించుకున్నాడట. ఈ విషయాన్ని నటుడు, నట శిక్షకుడు భిక్షు తెలిపారు.

తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి భిక్షు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో ఎం.ఎస్.రెడ్డి నిర్మించిన 'బాల రామాయణం' సినిమా చిత్రీకరణ సమయంలో.. తారక్ తో సహా అందులో నటించిన పిల్లలందరికీ నటనలో మెళుకువలు నేర్పే బాధ్యత తనకు అప్పగించినట్లు భిక్షు తెలిపారు. అప్పుడు తారక్ కి 10 ఏళ్ళు ఉంటాయని.. అతను పోషించింది శ్రీరాముని పాత్ర అయినప్పటికీ.. బయట ఆ పాత్రకి విరుద్ధంగా చాలా అల్లరిగా, హైపర్ యాక్టివ్ గా ఉండేవాడని చెప్పారు. ఏదైనా చెబుతున్నది అసలు ఈ పిల్లోడు వినిపించుకుంటున్నాడా లేదా అనే అనుమానం కలిగేదని.. కానీ షూటింగ్ లో రెడీ అనగానే తన నటనతో అందరినీ సర్ ప్రైజ్ చేసేవాడని భిక్షు చెప్పుకొచ్చారు.