Read more!

English | Telugu

శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం...

 


శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శేఖర్ మాస్టర్ వదిన మరణించిన విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.  "వదినా నిన్ను మిస్సవుతున్నాం...ఎంతో  బాధను భరించి చాలా బలంగా నిలబడ్డావు !!మీరు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు ..ఎల్లప్పుడూ  పాజిటివ్ మైండ్ సెట్ తోనే ఉండేవారు. మీ మరణాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను...   మీరు ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు...ఓం శాంతి" అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "మీ వైఫ్ అక్క గారా మాష్టర్ పోలికలు అలానే ఉన్నాయి...అసలు ఏమయ్యింది" అని అడుగుతున్నారు. శేఖర్ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. దీనికి ప్రముఖ నటి విష్ణు ప్రియ కామెంట్ చేసింది  "ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ" కామెంట్లు పెట్టింది. ఇక సినిమాల విషయానికొస్తే. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. వీటితో పాటు కొన్ని స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నాడు. శేఖర్ మాస్టర్ విజయవాడకు చెందిన వ్యక్తి. రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకుని ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఢీ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు స్పెషల్ హుక్ స్టెప్స్ అందిస్తూ ఫేమస్ అయ్యాడు. అయితే శేఖర్ మాస్టర్ తన వదిన చనిపోవడానికి గల కారణం ఏంటనేది  బయటపెట్టలేదు. కానీ  శేఖర్ మాస్టర్ కూతురు సాహితి మాత్రం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందని...తన పెద్దమ్మ కాన్సర్ తో ఫైట్ చేసి చనిపోయిందని ఆమె అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.