English | Telugu
కోలీవుడ్ స్టార్ అజిత్ తండ్రి కన్నుమూత
Updated : Mar 24, 2023
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అజిత్ తండ్రి పి. సుబ్రహ్మణ్యం(84) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సుబ్రహ్మణ్యంకు ముగ్గురు కుమారులు కాగా, అజిత్ రెండో కుమారుడు. భార్య షాలిని, పిల్లలతో కలిసి యూరోప్ టూర్ లో ఉన్న అజిత్.. తండ్రి మరణ వార్త తెలియగానే అక్కడినుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. అజిత్ చెన్నై చేరుకున్న తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుబ్రహ్మణ్యం మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
