Read more!

English | Telugu

సడెన్ సర్ ప్రైజ్.. పవర్ స్టార్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అంత తేలికగా రావు. ఒకవేళ అప్డేట్ వస్తుందని తెలిస్తే, అభిమానులు చేసే హంగామా మాములుగా ఉండదు. అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అప్డేట్ మాత్రం సడెన్ సర్ ప్రైజ్ లా ఏమాత్రం హడావుడి లేకుండా వచ్చేసింది. జస్ట్ ఒక ట్వీట్ తో మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించి షాకిచ్చారు మేకర్స్.

తమిళ్ మూవీ 'వినోదయ సీతం' తెలుగు రీమేక్ లో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. ఇటీవల ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే తాజాగా మేకర్స్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని 2023, జులై 28న విడుదల చేయబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఎలాంటి హడావుడి లేకుండా, కనీసం పోస్టర్ కూడా విడుదల చేయకుండా.. సింపుల్ గా ఒక ట్వీట్ తో రిలీజ్ డేట్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ త్వరలోనే రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.